దూరపు కొండలు నునుపు

దుబాయ్… ఇట్స్ వెరి కూల్ ప్లేస్ విజిటింగ్ కి, ఇది ఇక్కడికి వచ్చిన యాత్రికులు/వ్యాపారస్తులు చెప్పే మాట ఇది ఒక కోణం. (కాని ఇంట్లోనుండి కదిలితే ఎ/సి కార్ లేదా ఆఫీస్ ఈ రెండూ లేకుండా/కాకుండా ఎ/సి లేకుండా విహరిస్తే చెమటలు తొ దూల తీరిపోతుంది అది వేరే విషయం). ఇంకో కోణం ఇక్కడ మండే ఎండలు, పామర జనం అర్రులు చాచి కూటికోసం కడుపు చేతిలొపెట్టుకొని వచ్చి చివరికి ఇక్కడ జైళ్లలొ వారి జీవితాలను మగ్గపెట్టుకుంటున్నారు. నాకెందుకో ఇక్కడికి వచ్చే పని వాళ్లు, అంటే చదువుకోకుండా చేతిపని తెలియని వారిని చూస్తే జాలి, కోపం రెండూ ఒక్కసారిగా కలుగుతాయి. ఇక్కడ చేసే పని మన దేశం లొ చేయడానికి తెగ నామూషీ.  ఇలా ఆలోచించడం తప్పో ఒప్పో కాని. వారు ఉండే ప్రదేశాల స్థితులు, వారి జీవన గతులు చూస్తే కడుపులోని దుఖం తన్నుకరాకమానదు. మన తెలుగువారు ముఖ్యం గా మన తెలంగాణ సోదరులు.

తిండి లేక పస్తులుండేవారు, అద్దె కట్టలేక కార్టూన్స్ తొ గదిలా చేసుకొని జీవించేవారు (ఇక్కడ జీవించే చాలామంది తెలుగువారి ఉపాది పడేసిన కార్టూన్స్ ఏరుకోవడం, తాగి పడేసిన కూల్ డ్రింక్ డబ్బాలు ఏరుకోవడం వాటిని అమ్ముకొని వచ్చినదానితొ తినడం మిగిలితే ఇంటికి డబ్బులు పంపడం. ఇది ఎవరైన లేబర్ అఫైర్స్ కు కంప్లైన్ చేస్తే ఇంకో గూడు కోసం కొత్త నేరాలు.

ఇక ఇక్కడ కంపనీ తరుపున కూలీలు గా వచ్చిన వారికి అన్ని బావుంటాయ్ అనుకుంటే అది అత్యాశే. గొడ్డులా మండుటెండలొ చాకిరి చేయాలి. ప్రొద్దున ఆరింటికే సైట్ లొ ఉంటారు అంటే ఏ నాలుగన్నరకో ఐదుకో నిద్రలేవాలి, బస్సు కోసం పేద్ద క్యు, సాయంత్రం తొందరగా వెళతారంటె గ్యారంటీ లేదు, ఏ 8 కో 9 కో విపరీతమైన ట్రాఫిక్. అప్పుడు వండుకొని తినాలి. నిద్ర ఉండదు. ఇచ్చిన వసతైనా బాగుంటుందా అంటే అదీ చెప్పలేం ఒక్కో గదిలో గొర్రెలను దొడ్లో కుక్కినట్టు ఇరవై, ముప్పై మందినేసి కుక్కుతారు. ఇక్కడ డెబ్బై శాతం కూలీలు తెలుగువారే అని చెప్పొచ్చు. అందులో తెలంగాణ సోదరులు 90% ఉంటారు.

గుండె తరుక్కుపోయె వాళ్ల అమాయికత్వానికోదాహరణ చదవండి…

రెండేళ్ల క్రితం నాకు పెళ్లి కాక ముందు ఒక తెలుగు అతనితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉండేవాడిని, అతనిది మన కరీం నగర్. వారి ఊరోళ్లతను ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. తను ఎప్పుడు వచ్చినా చాలా బాధగా కనపడేవాడు. నేను అంత కలుపుగోలు వ్యక్తిని కాదు రెండొసారో మూడొసారొ వచ్చినప్పుడు అడిగాను “ఏంటయ్యా చాలా భాధ గా ఉంటావ్ ఎప్పుడొచ్చినా” అని.

“ఏంలె”

“మరెందుకు అంత డీలా గా ఉన్నావ్, భోజనం చేశావా”?
ఒక్కసారిగా గొల్లుమన్నాడు. అలా ఆప్యాయంగా పలకరించేసరికి.

“అన్నా రెండు రోజులగా పని దొర్కతాలె, అన్నం తిన్లె, ఈనెల అద్దె పైసల్ కట్టలేదని గదిలా ఆళ్లు బయటికి గెంటిండ్రు, గీ అన్నని (మా రూమ్మేట్) అడగడానికి మనసు వస్తలే, ఇప్పటికే రెండు మూడు సార్లు తీస్కొన్నవే ఇంతవరకు ఇవ్వలే.

మా రూమ్మేట్ నాకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తేలేదు (బహుశా తనకు చెప్పడం ఇష్టం లేక కావచ్చు) మిగిలినా లోకాభి రామాయణం మాట్లాడుకునే వాళ్లం కాని ఇలాంటివి కాదు.

“సరే ఈ డబ్బు తీసుకో అని అంటూనే, నేను కూడా వస్తాను పద వెళదాం హోటల్ కు అని ఆఫీస్ నుండి వచ్చిన వాడిని అలా అపార్ట్మెంట్ కిందనే ఉన్న రెస్టారెంట్ కు తీసుకెళ్లి భోజనం పెట్టించి మళ్లి గదికి వచ్చాము.

“పని దొరక్కపోవడమేమిటి, మీ కంపెనీ లో పని లేక పంపేశారా?”
“ఊహుం”

“మరి నీకు పతాకా (వొర్క్ పర్మిట్) లేదా?”
“లేదు”

“అంటే నువ్ కంపెనీ వీజా లొ లేవా”
“లేదన్నా, కళ్లి వెళ్లి” (అంటే విజిట్/టూరిస్ట్ వీజా లొ వచ్చి ఇక్కడే ఉండిపోవడం, అలాంటివాళ్లని కళ్లి వెళ్లి అంటారు)

“నీకు ముందు తెలిసే డబ్బులు ఇచ్చావా ఏజెంట్ కి?”
“అవ్ అన్నా” ఇక్కడ నాకు అర్థం కాలేదు మళ్లి అడిగాను.

“ముందు తెలిసే డబ్బులు ఇచ్చావా ఏజెంట్ కి?”
“అవ్ అన్నా, పోరగళ్లు అందరం అలానే ఇచ్చినం”

“ముందే చెప్పారా ఇలా కంపనీ లో పని కాకుండా బయట చేసుకొవడం సొంతంగా అని?”
“లేదన్నా, గవన్నీ మాకేం తెలుసన్నా ఏజెంట్ అజాద్ వీజా అన్నడు. ఏ పనైనా చేసుకొవచ్చు అని”

“మరి పోలీస్ వాళ్లు పట్టుకుంటే?”
“గదంతా ఏం తెల్వదన్నా  ఇక్కడ వచ్చాకే తెలిసింది ఇలా పని చేయడం తప్పు అని”

మొన్నా ఇక్కడ ఆమ్నెస్టీ పెట్టారు అందరూ మినిమం డాక్యుమెంట్స్ తొ దేశం విడిచి వెళ్లొచ్చు అని, కాని వారి దగ్గర వారి పాస్పోర్ట్ కూడా ఉండదు. తినేదానికి డబ్బుల్లేక, ఉండేదానికి చోటులేక ఎంత దుర్భరమైన పరిస్తితుళ్లొ ఉంటారంటే చెప్పడానికి వీళ్లేని స్థితి.

అవును ఇలా ఎందుకు వచ్చావ్, ఎందుకు రావాలనిపించింది అంటే దానికి సమాధానం…

“మా ఊళ్లొ పోరగాళ్లందురూ ఇక్కడున్నరు, వచ్చినప్పుడు ఇక్కడ నుండి వచ్చి మెడలో బంగారం గొళుసు, కళ్లకు అద్దాలు, గుడ్డలకు అత్తర్లు గివన్ని చూపించి ఇక్కడ జీవితం భలేగా ఉంటది అని చెప్పిండ్రు”

ఇక్కడనుండి వెళ్లిన వాళ్లు అంతాలా చూపించడం, పాపం అమాయక జనాలు ఇక్కడకు వచ్చి అవస్తలు పడడం.

ఏమైనా మన తెలుగు వారికి పాల్స్ ప్రిస్టేజ్ ఎక్కువ. నిండు కుండ తొణకదనుకోండి.

ఇవన్నీ కఠోర వాస్తవాలు, దూరపు కొండలు నునుపు అని పక్కనోడో ఇంకోక్కడో గల్ఫ్ కెళ్లి దండిగా సంపాయించేసారు అని ఉన్న ఊరును, కన్న తల్లిని ఒదిలి వచ్చేముందు ఆలోచించాలి. చెప్పినోడు చెప్పిన దానిలో నిజా నిజాలు ఎంత అని.

Published in: on 04/11/2007 at 2:44 PM  Comments (2)  

The URI to TrackBack this entry is: https://dinnipati.wordpress.com/2007/11/04/%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b0%aa%e0%b1%81-%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%81%e0%b0%a8%e0%b1%81%e0%b0%aa%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. మీరు చెప్పింది అక్షరాలా నిజం. నిజంగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. లక్షలు అప్పు చేసి దొంగ ఏజంట్ల చేతుల్లో కుమ్మరించి మరీ అక్కడికి వెళ్ళి నరక యాతన అనుభవించడం .. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఇంత కష్టంగా ఉంటుందని తెలిసినా ..పేదరికం వల్ల ఇక్కడ ఏమీ అవకాశాలు దొరకని దుస్థితి వాళ్ళను గల్ఫ్ బాట పట్టేలా చేస్తోంది. ఈ మధ్యే ఏదో పత్రికలో ఇదే విషయంపై సచిత్ర కథనాన్ని ప్రచురించారు. ఇక ముందైనా ఈ పరిస్థితి లో మార్పు రావాలని కోరుకుంటున్నాను.
    కృతజ్ఞతలు

  2. నరేష్ గారు.

    ఇక్కడ అలా ఉండే వారి భాధలు ఒకొక్కరివి ఒక్కో విధంగా ఉన్నాయ్. ఈ రోజు కూడా ఈనాడు లో ఈ వార్త వచ్చింది చూడండి.


Reply