మతానికి మూలాధారం ఉందా?

           మతమన్నది భక్తివిశ్వసాల పై ఆధారపడి ఉంటుందని అంటన్నారు. దీనితో పాటు అనేక సందర్భాల్లో మతమన్నది కేవలం వివిధ సిద్ధంతాల సంపుటి గా ఉంది.మతాలన్నింటిలొ అంతఃకలహాలు ఉండటానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు.

ఈ సిద్దాంతాలు తిరిగి విశ్వాసం పై ఆధారపడి ఉంటాయి.  ఆంతరిక్షం లొ ఎక్కడో కూర్చొని, బ్రహ్మండాలన్నింటిని పాలించే వ్యక్తి ఉన్నాడని చెబుతాడు.  తానలా రూడీగా చెప్పడమే ఆగమప్రమాణంగా అంగీకరించి, తనమాటలు నమ్మాలా? లేక కొందరికి వెరే అభిప్రాయాలుంటాయి.  వాటిని ఇతరులు నమ్మాలి అంటారు.  ఎందుకు నమ్మాలి అని వారిని అడిగితే కారణం చెప్పలేరు.

కాబట్టి ఈ రొజుల్లో మతమన్నా, వేదాంతమన్నా దురభిప్రాయం కలుగుతున్నది.  “ఓహో, ప్రతి వ్యక్తి తనకు నచ్చిన ఊహలను భోధిస్తున్నాడు.  వాటి మంచి చెడులని నిర్ణయించడానికి ఒక ప్రమాణం అంటూ లేదు. ఈ మతాలన్ని వట్టి సిద్దాంతాల కట్టలు”  అని విద్యాధికుల అభిప్రాయం.

ఐనా, భిన్న దేశాళ్లో, భిన్న మతస్తుల, భిన్న అభిప్రాయాలే కాక, భిన్న సిద్దాంతాలునూ సమన్వయం చేస్తూ, ఆస్తికతకు సర్వజనసామన్యమైన మూలాధారమొకటుంటుంది.  మూలానికి వెళ్లి చూస్తే, అవి కూడా, సర్వజనసామాన్యనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు.  ప్రపంచం లో ఉన్న వివిధ మతాలన్నింటిని విభజించి చూస్తే, ఆగమ ప్రామాణ్యం లేదా గ్రంథ ప్రామాణ్యం గలవి లేనివి అని రెండు రకాలుగా ఉన్నట్లు తోస్తుంది.  గ్రంథ ప్రామాణ్యం ఉన్న మతాలు ప్రబలాలవ్వటం వల్ల, చాల మంది వాటిని అవలంబిస్తున్నారు.   ఆ ప్రామాణ్యం లేనివి చాలా వరకు నశించాయి.  ఇక క్రొత్తగా వెలసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాల తక్కువగా ఉన్నారు.

ఐతే, ఈ మతాలు భొధించే తత్వాలన్ని ప్రత్యేక వ్యక్తుల అనుభవ పలితాలన్న విషయం లో ఈ మతాలన్ని ఏకీభవిస్తున్నట్టు కాన వస్తాయి.  తనమతాన్ని నమ్మమని క్రైస్తవుడు చెబుతాడు, అతని మాటలు విని క్రీస్తులో క్రీస్తు అవతారం లో దేవుని లో జీవుని లో జీవుని భవిస్యత్ ఉత్తమస్తితి లో విశ్వాసం పూనాలంటాడు.   కారణమేమిటి అని ఆడిగితే,  అది తన నమ్మకం అంటాడు కాని,క్రైస్తవ మతానికెళ్లి చూస్తే, అనుభూతి దానికాధారం అని గ్రహిస్తారు.  క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు.  అతని శిష్యులు తాము భవంతుని అనుభూతిని పొందామని చెప్పారు.

ఇలాగే బౌద్ద మతంలొ కూడా బుద్దుని అనుభూతే ప్రధానంగా ఉంది.  బుద్దుడు కొన్ని సత్యాలను అత్మానుభూతి వల్ల గ్రహించాడు.  వాటిని నవలోకించాడు.  వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్వదర్శియై లోకానికి తత్వోపదేశం గావించాడు.

హిందువుల విషయం ఇలాంటిదే.  స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చాటుతూ, తాము కన్న తత్వాలనే లోకానికి భొధిస్తున్నారు.

జ్ఞానికంతా ప్రత్యక్షానిభూతే పునాది.  ప్రపంచ మతాలన్నింటికి త్రికాలాబాదిత ప్రత్యక్షానుభూతే మూలాధారమై స్పస్ఠమౌతోంది.  మత ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే.  ఆత్మదృష్టులై, త్రికాలజ్ఞులై తమ శశ్వతతత్వాన్ని దర్శించి తాము కన్నదాన్ని వారు లోకానికి భొధించారు.

ఈ అనుభూతులు నేడు అసాద్యాలని, మొదట మతాలు స్థాపించిన ఏ కొంతమందికో అవి సాద్యమయ్యాయని ఇప్పటి వాదన.  ఈ రోజుల్లో ఆ అనుభూతులు చల్లవట!  అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏది లేదట!

Published in: on 09/05/2009 at 8:42 AM  Comments (5)  

The URI to TrackBack this entry is: https://dinnipati.wordpress.com/2009/05/09/%e0%b0%ae%e0%b0%a4%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%82%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%89%e0%b0%82%e0%b0%a6%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. మతాలు పుట్టడానికి రక రకాల కారణాలు కనిపిస్తాయి. మన హిందూ మతం చాలా పురాతన మైనదిగా వుంది. కాల క్రమేణా కొన్ని ఆచారాలను కోల్పోతూ మరి కొన్ని ఆచారాలను అక్కున చేర్చుకొంది. ఒక దశలో పూర్తిగా అంతరించి పోయి శంకరాచార్యుడు లాంటి వారివల్ల పునరుత్థానం కావింప బడింది. ఒక విధంగా చూస్తే హిందూ మతం మన కాంగ్రెస్ పార్టీలాంతిది. అన్నిటికి మూలమైనది గానే కనిపిస్తుంది. అయితే అన్ని దుర్లక్షణాలను ముతా కట్టు కుంది.

    ఇక పోతే బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం గొప్ప వ్యక్తుల బోధన లోంచి, నాటి దేశ కాల పరిస్థితులకు వ్యతిరేకంగా సంఘటితం కావడంలో భాగంగా పుట్టిన మతాలుగా భావించ వచ్చు. అయితే విచిత్ర మేమిటంటే తర్వాతి తరాల్లో మూల పురుషుడి అభిప్రాయాలకు విలువ తగ్గి ఉన్నత వర్గాలకు ఉపయోగ పడే అభిప్రాయాలకు విలువ పెరగడం. మూల పురుషుడిని వ్యక్తిగా పూజించడం, అతని అభిప్రాయాలని అటకెక్కించడం సాధారణంగా కనిపించే విషయాలు.

    ఉదాహరణకి బుద్ధుడు కాని, జీసస్ కాని ఎక్కడా తాను దేవుడినని చెప్పుకున్న సందర్భాలు ఉండవు. ఏ హిందూ మత ఆచారాలను బుద్ధుడు నిరసించాడో ఆ హిందూ మతమే బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చేసింది. ఏ రోమన్, హిబ్రు అరాచకాలను క్రీస్తు నిరసించాడో, ఆ వర్గాలే తిరిగి క్రిస్తియన్లుగా రూపాంతరం చెందాయి.

    అయితే ఒకటి మాత్రం స్పష్టం. ప్రతి మతం వల్లా, ప్రవక్త వల్లా ప్రజల జీవన విధానంలో గాని, ఆలోచనా విధానంలో గాని కొంత మార్పు వచ్చింది. తద్వారా చరిత్ర గమనంలో కుడా మార్పు వచ్చింది. ఆ విధంగా ఆ మహానుభావులు తప్పకుండా పూజనీయులే. ఇక్కడ పూజ అంటే వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, వీలయితే ఆలోచించడం, అంతే కాని బండ రాళ్ళను ప్రతిష్టించి పాలు తేనే ఒలక బోయడం కాదు.

  2. sir your right.

  3. YOU R WRONG SIR AVI BANDA RALLU KADU OKA SAMAJANNI NADIPE DAVVULLU

  4. chaala super ga cheppaaru..

  5. it is correct sir


Reply