ఉగాది శుభాకాంక్షలు

 

 

బోసి నవ్వుల బుడ్దోడి కిల కిలలు,

చిన్నారి చిన్ని కాళ్ల గజ్జెల గలగలలు,

అక్క చెల్లెళ్ల పట్టు పరికిణి ఓణి రెప రెపలు,

మల్లెల పరిమళం గుబాళింపుల మద్య,

 

మంచి (నువ్వుల) నూనె తో తలంటుకొని,

కొత్త బట్టలు కట్టుకొని,

ఉగాది పచ్చడి ఆరగించి.

 

అమ్మ చేతి ముద్ద పప్పు,అన్నం తో,

నాణ్యమైన ఆవు నెయ్యి నిబ్బరంగా దట్టించి,

పిండివంటలు కంచం నిండుగా,

మధు మెహన్ని మరుగుకు జరిపి,

బీపీ ని బయటకి నెట్టి,

ఓ పట్టు పట్టి గట్టి గా త్రేంచండి.

ఈ ఉగాది మీ ఇంట సిరి సంపదలు తో వెలగాలని కోరుకుంటూ..

 

-శివకుమార్ దిన్నిపాటి 

Published in: on 27/03/2009 at 12:20 AM  Comments (5)  

The URI to TrackBack this entry is: https://dinnipati.wordpress.com/2009/03/27/%e0%b0%89%e0%b0%97%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

  2. మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  3. ఉగాది శుభకాంక్షలు

  4. మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు

    ఎక్కడ మాయమైపోయారు. మరీ ఏడాదికొక్క టపానా.. అస్సలు బాలేదు..

  5. wish u the same

    oplz watch our channel


Reply